తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాంగ్రెస్​ పార్టీ పోరాటం ఫలితమే సిద్దిపేట కలెక్టర్ బదిలీ' - టీపీసీసీ వార్తలు

తాము చేసిన పోరాటం ఫలితంగానే సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని బదిలీ చేశారని కాంగ్రెస్​ పార్టీ తెలిపింది. కలెక్టర్​గా ఉంటూ అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి జడ్సన్‌, ఇందిరా శోభన్‌ ఆరోపించారు. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షపార్టీగా కాంగ్రెస్‌ పోరాటం చేసేందుకు యత్నిస్తే తమ గొంతు నొక్కారని ధ్వజమెత్తారు.

congress party allegations on siddipet collector venkatrami reddy
'కాంగ్రెస్​ పార్టీ పోరాటం ఫలితమే సిద్దిపేట కలెక్టర్ బదిలీ'

By

Published : Oct 26, 2020, 5:56 PM IST

కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేసిన పోరాట ఫలితంగానే సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని బదిలీ చేశారని పీసీసీ ప్రధాన కార్యదర్శి జడ్సన్‌, ఇందిరా శోభన్‌ తెలిపారు. కలెక్టర్‌ స్థాయిలో ఉంటూ.. అధికార పార్టీకి అనుకూలంగా పని చేశారని ఆరోపించారు. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షపార్టీగా కాంగ్రెస్‌ పోరాటం చేసేందుకు యత్నిస్తే తమ గొంతు నొక్కారని ధ్వజమెత్తారు. ఎస్సీ రైతు నర్సింహులకు చెందిన రెండు ఎకరాల పొలాన్ని.. సిద్దిపేట కలెక్టర్‌ అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు.

కలెక్టర్ వల్ల ఆ రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు. అప్పట్లో తాము సిద్దిపేట వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. విషయంపై జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించగా.. గత నెల 28న కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, ఎస్పీకి నోటీసులు ఇచ్చారన్నారు.

రెండు వారాలు గడువు విధించి.. నర్సింహులు ఆత్మహత్యపై నివేదిక కోరారని తెలిపారు. దుబ్బాక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేట్లు ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details