దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస, భాజపాను ఓడించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో శనివారం నిర్వహించిన రోడ్‌షోలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో దుబ్బాక నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లతో పాటు అనేక అభివృద్ధి పనులకు కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ముత్యంరెడ్డి, రామలింగారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారని... నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు కృషి చేశారో ప్రజలు పోల్చుకోని చూడాలన్నారు.
తెరాస, భాజపాను ఓడించాలి: ఉత్తమ్ - దుబ్బాకలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
దుబ్బాక నియోజకవర్గంలోని పెద్దగుండవెల్లిలో నిర్వహించిన రోడ్ షోలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెరాస, భాజపాలను ఓడించాలని పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయని ప్రభుత్వానికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు.
తెరాస, భాజపాను ఓడించాలి: ఉత్తమ్
గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలతో పోలిస్తే దుబ్బాకలో ఎందుకు అభివృద్ధి జరగలేదని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని తెరాసకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నేతలు అనంతుల శ్రీనివాస్, సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరసు ప్రభాకర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:చివరి అంకానికి ప్రచారం... ఏర్పాట్లలో అధికార యంత్రాంగం
Last Updated : Nov 1, 2020, 10:48 AM IST