తెలంగాణ

telangana

ETV Bharat / state

'పెరిగిన ముడిచమురు​ ధరలు సామాన్య ప్రజలకు భారం' - congress leaders protest infront of rdo office at husnabad

పెరిగిన పెట్రోల్, డీజిల్​ ధరలను వెంటనే తగ్గించాలంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కాంగ్రెస్​ నాయుకులు ధర్నా నిర్వహించారు. లాక్​డౌన్​తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలను పెరిగిన పెట్రోల్,​ డీజిల్​ ధరలు తీవ్ర అవస్థలపాలు చేస్తున్నాయని వారు ఆరోపించారు.

congress leaders protest in front of rdo office at husnabad siddipeta
'పెరిగిన ముడిచమురు​ ధరలు సామాన్య ప్రజలకు భారం'

By

Published : Jun 29, 2020, 3:32 PM IST

పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. పెంచిన పెట్రోల్,​ డీజిల్​ ధరలు తగ్గించేలా ప్రభుత్వానికి విన్నవించాలని కోరుతూ ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు.

ఓవైపు లాక్​డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీనిపై స్పందించి ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..!

ABOUT THE AUTHOR

...view details