సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. ప్లకార్డులతో నిరసన చేపట్టారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా ఏర్పాటు చేసినా కనీసం 30 పడకల ఆస్పత్రిలో ఉండే వసతులు కూడా లేవని డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి చెప్పారు.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: కాంగ్రెస్ - తెలంగాణ వార్తలు
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నారు.
ఆస్పత్రికి వచ్చే రోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. హుస్నాబాద్ కరువు ప్రాంతమని పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రితో పాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు, హాస్టల్ భవనాలు ఖాళీగా ఉన్నాయని వాటిలో కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పెళ్లిళ్లకు, ఆలయాల పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవలకు వెళ్తున్నాడు కాని నియోజకవర్గంలో కరోనా రోగుల పరిస్థితిని సమీక్షించకుండా, ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.