సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా లారీకి తాడు కట్టి లాగుతూ కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. హుస్నాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు మూడేళ్లకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేదని.. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం నెలకు, 25 రోజులకు ధరలను పెంచుతూ పోతోందని డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి మండిపడ్డారు. మన దేశంలోని ధరల కంటే చుట్టు పక్కల దేశాల్లో రూ.15, 20 రూపాయలు తక్కువగానే ఉన్నాయన్నారు.
లారీకి తాడుకట్టి లాగుతూ కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన - తెలంగాణ వార్తలు
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా సిద్దిపేట జిల్లాలో లారీని లాగుతూ కాంగ్రెస్ నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్యులపై పెను భారం పడుతుందని ఆరోపించారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్యులపై పెను భారం పడుతుందని ఆరోపించారు. వంట గ్యాస్ ధర కూడా వెయ్యి రూపాయలకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల సామాన్య ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ఓ వైపు కరోనా, లాక్‌డౌన్‌తో ఉపాధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు పెరిగి సామాన్య ప్రజలకు గుదిబండగా మారాయన్నారు. ఇప్పటికైనా పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఎంపీకే టోకరా.. క్రెడిట్ కార్డు ఫోర్జరీతో మోసం!