సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పీవీ నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రి కూడా అయ్యారని డీసీసీ అధికార ప్రతినిధి లింగమూర్తి తెలిపారు.
పీవీ పేరుతో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి: కాంగ్రెస్ - పీవీ శత జయంతి న్యూస్
ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకరణ విధానాలే దేశ అభివృద్ధికి నాంది పలికాయని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీవీ పేరు మీద తెలంగాణలో ప్రాజెక్టును లేక యూనివర్సిటీని గానీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
హుస్నాబాద్‌లో పీవీ చిత్రపటానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశంలోనే మొట్టమొదట భూసంస్కరణల చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. మొదట తనకు ఉన్న 1800 ఎకరాల భూమి నుంచి 800 ఎకరాల భూమిని పంపిణీ చేసిన గొప్ప నాయకుడని అన్నారు. అనతికాలంలోనే దేశ రాజకీయాల్లో అత్యున్నత పదవులను అధిరోహించి తెలుగు రాష్ట్రం నుంచి మొదటి ప్రధాని అయ్యారని వెల్లడించారు.
ఇవీ చూడండి : తెలుగువారి ఠీవీ- మన పీవీ: 'ఈటీవీ భారత్' అక్షర నివా
ళి