తెలంగాణ

telangana

ETV Bharat / state

తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్ నాయకులు - సిద్దిపేట జిల్లా సమాచారం

దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ మారుతున్నాడంటూ దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పీఎస్​లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఓ మీడియాలో వచ్చిన కథనాన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న భాజపా మండల ప్రధాన కార్యదర్శి వెల్దండి సంతోష్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Congress leaders compliant on bjp leader to spread fake news in social media
తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్ నాయకులు

By

Published : Nov 3, 2020, 7:06 PM IST

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న భాజపా కార్యకర్తపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్​స్టేషన్​లో కాంగ్రెస్​ నాయకులు ఫిర్యాదు చేశారు. దుబ్బాక కాంగ్రెస్​ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్​రెడ్డి తెరాసలో చేరుతున్నారంటూ దుష్ప్రచారం చేశారని పట్టణ అధ్యక్షుడు ఆక్కు శ్రీనివాస్ ఆరోపించారు.

తప్పుడు ప్రచారానికి పాల్పడిన భాజపా మండల ప్రధాన కార్యదర్శి వెల్దండి సంతోష్​పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తితో కలిసి పోలీసులను కోరారు. అతని చర్య వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. వీరితో పాటు కౌన్సిలర్ వల్లపు రాజు, రాజిరెడ్డి, బొంగోని శ్రీనివాస్, బురుగు కిష్టస్వామి, పున్న సది, గుగులోతు రాజు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈవోను కలిసిన పీసీసీ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details