సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని లచ్చపేటలో మాజీ మంత్రి కొండా సురేఖ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలంటూ అభ్యర్థించారు.
కాంగ్రెస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: కొండా సురేఖ - దుబ్బాక ఉప ఎన్నికల తాజా సమాచారం
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని మాజీ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా లచ్చపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటువేసి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: కొండా సురేఖ
దుబ్బాక నియోజకవర్గంలో దివంగత చెరుకు ముత్యంరెడ్డి హయాంలోనే అభివృద్ధి పనులు జరిగాయని సురేఖ పేర్కొన్నారు. తెరాస ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కుల సంఘాలకు డబ్బులు పంచుతూ.. ఓట్లు అడుగుతున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెరాస నాయకులు కోట్లు సంపాదించుకున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి చెందాలంటే తెరాసను ఓడించి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.