సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వైద్యుడిని నియమించేలా చొరవ చూపాలని.. ఆసుపత్రి వైద్యాధికారి మురళీకృష్ణకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆక్కు శ్రీనివాస్ వినతిపత్రం అందించారు.
కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున… ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఆ ఆసుపత్రిలో పిల్లల వైద్యుడిని నియమించాలని కోరారు. పిల్లలకు ప్రతిరోజు వైద్య పరీక్షలు, చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.