గెలుపు ధీమాగా మండలాల్లో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ.. మండల ఇన్ఛార్జ్లతో పాటు బూత్ ఇన్ఛార్జ్, గ్రామ నాయకులతో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపుకై కృషి చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు నాయకులు గ్రామాల్లో తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు.
మిరుదొడ్డి దుబ్బాక మండలంలో జరిగిన కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో పాల్గొన్న మణిక్కం ఠాగూర్, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ , చిన్నారెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ రాజయ్య, జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, మండల బూత్ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.