తెలంగాణ

telangana

ETV Bharat / state

సుజాతను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి: హరీష్​రావు​ - దుబ్బాక ఉపఎన్నికలు

దుబ్బాకలో సోలిపేట సుజాతను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తామని మంత్రి హరీష్​రావు ధీమా వ్యక్తం చేశారు. మంత్రి హరీష్​ సమక్షంలో పలువురు కాంగ్రెస్​, భాజపా నుంచి తెరాసలో చేరారు. పలు ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి కాంగ్రెస్​ నాయకులే కారణమని ఆయన మండిపడ్డారు.

congress, bjp activists joined in trs party in front of minister rao in siddipet district
సుజాతను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి: హరీష్​

By

Published : Oct 20, 2020, 8:49 PM IST

సిద్దిపేట జిల్లా తొగుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మాగౌడ్​తో పాటు వంద మంది కాంగ్రెస్, భాజపా నుంచి తెరాసలో చేరారు. మంత్రి హరీష్ రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువత పెద్ద ఎత్తున తెరాసలో చేరుతోందని మంత్రి హరీష్​ అన్నారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు ఆలస్యం అవడానికి కారణం కాంగ్రెస్ నాయకులేనని మంత్రి ఆరోపించారు. తెరాస పార్టీకి విశ్వాసం, విశ్వతనీయత ఉందన్నారు.

సుజాతను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి: హరీష్​

కొండపోచమ్మ, రంగనాయక సాగర్ భూనిర్వాసితులకు పరిహారం ఎలా అందిందో... అదే విధంగా మల్లన్నసాగర్ బాధితులకు కూడా ఇస్తామన్నారు. తొగుట నుంచి తెరాస అధిక మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు కరెంటు ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్​ నాయకులు ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వద్దని కోర్టులో కేసులు వేసినందుకు అడుగుతారా?.. అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఉపఎన్నికల అన్నింటిలో తెరాసే విజయం సాధించిందని... ఈ ఎన్నికల్లో కూడా గెలుపు గులాబీ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. భాజపా గోబెల్స్​ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతోందన్నారు. తొగుట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామన్నారు. సోలిపేట సుజాతను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: 'ప్రతి ఎమ్మెల్యే అక్కడే ఉండాలి... సహాయక చర్యలు పర్యవేక్షించాలి'

ABOUT THE AUTHOR

...view details