తెలంగాణ

telangana

ETV Bharat / state

'కోర్టు పరిధిలో ఉన్న భూముల్లో పనులెలా చేపడతారు' - సిద్దిపేట జిల్లా తోగుట్టలో మల్లన్నసాగర్​ నిర్వాసితులు, కాంట్రాక్టర్లకు మధ్య వాగ్వాదం

కోర్టు పరిధిలో ఉన్న భూముల్లో పోలీసుల సహాయంతో కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టారని తొగుట మండలం వేముల ఘాట్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మల్లన్నసాగర్​ ప్రాజెక్టు పనుల్లో భాగంగా భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించకుండా పనులు చేపట్టొద్దంటూ డిమాండ్​ చేశారు.

Conflict between Mallannasagar Expats and contractors in Siddipet
'కోర్టు పరిధిలో ఉన్న భూముల్లో పనులెలా చేస్తారు'

By

Published : Dec 8, 2019, 11:17 PM IST

మల్లన్న సాగర్​ ప్రాజెక్టు పనుల్లో భాగంగా కోర్టు పరిధిలో ఉన్న భూముల్లో కాంట్రాక్టర్లు పనులు చేపడుతున్నారంటూ సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేముల ఘాట్​ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. నల్ల చెరువుకు గండి కొట్టి నీటిని వృథాగా వదిలేస్తున్నారంటూ వాపోయారు. కొందరు రైతులకు చెందిన భూముల విషయమై కోర్టు విచారణలో ఉండగా... ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా కాంట్రాక్టర్లు పనులు చేపట్టొద్దంటూ డిమాండ్​ చేశారు.

కేసులు విచారణ పూర్తయ్యేవరకు తమ భూముల్లో ఎటువంటి పనులు చేపట్టరాదని చెప్పినా.. పోలీసుల సహాయంతో కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టారని వాపోయారు. ఆర్డీవోకు వాట్సాప్ ద్వారా విన్నవించినా స్పందించలేదన్నారు. నల్లచెరువుకు గండి కొట్టి 30 శాతం నీటిని వృథా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'కోర్టు పరిధిలో ఉన్న భూముల్లో పనులెలా చేపడతారు'

ఇదీ చూడండి: 'హక్కుల పరిరక్షణకు బీసీలు ఉద్యమించాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details