ఆర్టీసీ సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిపో ఆవరణలో కార్మికులు దీక్ష చేపట్టారు. కార్మికులకు మద్దతుగా సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెరాస ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమని... ఇలాంటి ప్రభుత్వం తెలంగాణకు అవసరం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ పేర్కొన్నారు. 42 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. కార్మికులను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి... వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కార్మికులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్న కామ్రెడ్లు - latest news on rtc strike in siddipet
ఆర్టీసీ సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లాలో కార్మికులు దీక్ష చేపట్టారు. కార్మికులకు మద్దతుగా సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు దీక్షలో పాల్గొన్నారు.
కార్మికులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్న కామ్రెడ్లు