సిద్దిపేట జిల్లా చింతమడకలో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి పర్యటించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నూతంగా నిర్మించ తలపెట్టిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సౌకర్యం, ఇళ్ల నిర్మాణంపై ఆరా తీశారు. చింతమడకను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామస్థులతో చర్చించారు. ఆయన వెంట సుడా ఛైర్మెన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, ఆర్డీవో, ఎమ్మార్వో, సర్పంచి తదితరులు ఉన్నారు.
చింతమడకలో కలెక్టర్ పర్యటన - చింతమడకలో కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి పర్యటన
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతూరు చింతమడకలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి పర్యటించారు. గ్రామంలో చేపట్టాల్సిన మౌలిక వసతులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

చింతమడకలో కలెక్టర్ పర్యటన