పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామాల్లో విజయమంతం చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ గ్రామ కార్యదర్శి నుంచి మొదలుకుని ప్రతి ఒక్క అధికారి బాధ్యత వహించాలని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌తో కలిసి నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పల్లె ప్రగతిలో భాగంగా డంపింగ్‌యార్డ్, శ్మశాన వాటిక, హరితహారం పనులను త్వరతగతిన పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు.
మూడురోజులు విధులకు గైర్హాజరైతే సస్పెన్షనే: కలెక్టర్ వెంకట్రామరెడ్డి - collector venkatram reddy review meet in siddipeta
విధులకు నెలలో మూడు రోజులు వరుసగా గైర్హాజరైన కార్యదర్శులను సస్పెండ్ చేస్తానని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ స్థాయి అధికారులతో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
మూడురోజులు విధులకు గైర్హాజరైతే సస్పెన్షనే: కలెక్టర్ వెంకట్రామరెడ్డి
మండలాల్లో రైతు వేదికలు, రైతులకు కల్లాల నిర్మాణం, పశువుల కొట్టాలు, గొర్ల కొట్టాలు నిర్మించాలంటూ ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న హుస్నాబాద్ మండల ఎంపీవో సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా నెలలో మూడు రోజులు వరుసగా గైర్హాజరైన కార్యదర్శులను సస్పెండ్ చేస్తానని చెప్పారు.
ఇదీ చూడండి:బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్‌ఫోన్ కానుక