సిద్దిపేటలో ఇప్పటికి ఒకే ఒక కరోనా పాజిటివ్ వచ్చిందని.. కొత్తకేసులు రాకుండా అధికారులందరూ పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వెంకటరామిరెడ్డి తెలిపారు.
'కరోనా కట్టడికై అధికారులంతా సమన్వయంతో పనిచేస్తున్నాం' - కరోనా కట్టడికై చర్యలు
సిద్దిపేట జిల్లాలో పకడ్బందీగా కరోనా కట్టడి చర్యలను చేపడుతున్నామని లాక్డౌన్ పూర్తిస్థాయిలో అమలుచేస్తున్నామన్న కలెక్టర్ వెంకటరామిరెడ్డితో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి...
" కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నివసించిన ప్రాంతాన్ని, అతను తిరిగిన మూడు ఏరియాలను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచి ఎప్పటికప్పుడు వైద్యబృందాలతో అక్కడ సర్వే నిర్వహిస్తున్నాము. డివిజినల్ ప్రాంతాల్లో, కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్రూమ్స్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రతీ రోజు జిల్లా యంత్రాంగం ప్రతి గ్రామపంచాయతీలతో టెలీకాన్ఫరెన్స్ను నిర్వహించి సూచనలు సలహాలు అందజేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాము.. కేంద్రాల్లోనూ కరోనా కట్టడికి అన్ని ఏర్పాట్లు చేశాం- కలెక్టర్ వెంకటరామిరెడ్డి"
ఇదీ చదవండి:కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక