సిద్దిపేట జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండిపోయి ప్రవహిస్తున్నాయి. తాజాగా కొద్దిరోజులు కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని చెరులువులు అలుగు పోస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలోని వర్ష పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సూచించారు.
'వర్ష సూచనతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి' - సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం
వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధికారులతోపాటు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు.

'వర్ష సూచనతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి'
ఇప్పటికే జిల్లాలో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండడం వల్ల అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల కేంద్రాల్లో అన్ని శాఖల అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇదీ చూడండి:ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం