సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. పలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వారి కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఎక్కడ కూడా ఎలాంటి గొనె సంచుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ - తెలంగాణ తాజా వార్తలు
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
collector tour
రైస్‌మిల్ యాజమాన్యంతో మాట్లాడి తొందరగా ధాన్యాన్ని రైస్‌మిల్‌కు తరలించాలని సూచించారు. కలెక్టర్‌తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.