భూ విస్తీర్ణం, ఆకారాన్ని బట్టి ప్రణాళిక బద్ధంగా పల్లె ప్రకృతి వనాలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై గజ్వేల్ ఐఓసీ కార్యక్రమంలో అధికారులతో సమీక్షించారు.
పగోడా(గజబో), వాకింగ్ ట్రాక్స్, ఆట వస్తువులు, బెంచీలు, గ్రీన్ వాల్, పూల మొక్కలతో కూడిన పార్కులను 15 రోజుల్లో నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీవోలు, ఏపీఓలు సంబంధిత మండలంలోని గ్రామాల బాధ్యతలు తీసుకొని పనుల్లో వేగం పెంచాలని సూచించారు.