సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ప్రత్యేక ఆరోగ్య వైద్యశిబిరం ఏర్పాటు చేసి గ్రామస్థులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.వెంకట్రామారెడ్డి తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఆరోగ్య వైద్య శిబిర ఏర్పాట్లను ఆర్డీవో జయచంద్రా రెడ్డి, డీఎంహెచ్వో అమర్ సింగ్లతో కలిసి పరిశీలించారు. మాజీ మంత్రి హరీశ్ రావు, యశోదా ఆసుపత్రి వ్యవస్థాపకులతో కలిసి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రతి రోజు 2 వార్డుల చొప్పున వైద్య పరీక్షలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి కౌంటరు వద్ద సూచిక బోర్డులు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
చింతమడకలో హెల్త్ క్యాంపు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ - Helth camp Fesilities
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సూచిక ఉండాలనే లక్ష్యంతో ఇటీవల చింతమడక పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ వెల్లడించారు. హరీశ్ రావు దీనిని ప్రారంభించనున్న నేపథ్యంలో వైద్య శిబిర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామారెడ్డి పరిశీలించారు.

చింతమడకలో హెల్త్ క్యాంపు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
చింతమడకలో హెల్త్ క్యాంపు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్