సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పలు పనులను ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు క్షేత్ర స్థాయిలో మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ వెంకటరామి రెడ్డి పర్యవేక్షించారు. ప్రారంభోత్సవ భవనాలను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు.
సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు - CM's tour arrangements at gajwel Ministers oversee
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రేపు జరుగబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు
సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 2300 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పాసులు ఉన్న వారికే ఈ కార్యక్రమంలో అనుమతించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు
ఇదీ చూడండి : ఫిబ్రవరి 17 నుంచి నగరంలో 17వ బయో ఏషియా సదస్సు