తెలంగాణ

telangana

సీఎం సహాయనిధి.. నిరుపేదలకు వరం: హరీశ్ రావు

సీఎం సహాయనిధి నిరు పేదలకు వరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 42మందికి 16,48,50 రూపాయల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. అవి బ్యాంకులో వెంటనే జమ చేసుకోవాలని సూచించారు.

By

Published : Jan 16, 2021, 10:18 PM IST

Published : Jan 16, 2021, 10:18 PM IST

Distribution of CMRF checks
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

నిరుపేదలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందనడానికి సిద్దిపేట నిదర్శనమని మంత్రి హరీశ్ రావు అన్నారు. నియోజకవర్గంలోని 42మంది లబ్ధిదారులకు 16,48,50రూపాయల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు.

వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. పట్టణానికి చెందిన 20మందికి రూ.8,67,500, సిద్దిపేట రూరల్ మండలంలో ముగ్గురికి రూ.55వేలు, అర్బన్​లో ఐదుగురికి రూ.1,64,500 విలువైన చెక్కులు అందించారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

చిన్నకోడూర్​లో ఏడుగురికి రూ.2,26,500, నంగునూరులో ముగ్గురికి రూ.2లక్షల 5వేలు, నారాయణ రావు పేట మండలాల్లో నలుగురికి రూ.1,29,550 పంపిణి చేశారు. 17మందికి ప్రభుత్వ జీఓ 59కింద రెగ్యులరైజ్ చేసిన ప్రొసీడింగ్స్ కాపీలు అందజేశారు.

పంపుసెట్లు పంపిణి..

జిల్లాలోని 9మంది ఎస్సీ లబ్ధిదారులకు టెక్స్​మో 5హెచ్​పీ, 10స్టేజీ సబ్ మర్సిబుల్ పంపుసెట్లు మంత్రి పంపిణీ చేశారు. నంగునూరు మండలం రాంపూర్ గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు రూ.8,25,552 విలువైన మెటీరియల్స్ అందించినట్లు పేర్కొన్నారు.

పంపుసెట్లు పంపిణీ చేస్తున్న మంత్రి

కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, ఏఎంసీ ఛైర్మన్ పాల సాయిరాం, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచ్ లక్ష్మీ, ఎల్లాగౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:యాసంగి నుంచి కొనుగోలు కేంద్రాల రద్దు: నిరంజన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details