ఈ నెల 22న తన స్వగ్రామం చింతమడకకు ముఖ్యమంత్రి కేసిఆర్ రాబోతున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఎమ్మెల్యే హరీశ్ వివరాలను వెల్లడించారు. ఉదయం 11 గంటలకు చింతమడక చేరుకోనున్న కేసీఆర్ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. సభలో పాల్గొని ప్రజలతో మాట్లాడతారన్నారు. అనంతరం ప్రజలతో కలిసి భోజనం చేస్తారని చెప్పారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగంతో కలిసి హరీశ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సోమవారం చింతమడకకు సీఎం కేసీఆర్ - harish rao
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తన స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకకు రానున్నారు. సీఎం వస్తుండడం వల్ల జిల్లా యంత్రాంగంతో కలిసి ఎమ్మెల్యే హరీశ్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
హరీశ్ రావు