CM KCR visited Komuravelli Mallanna temple: గోదావరి జలాలతో కొమురవెల్లి మల్లన్నకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభిషేకం చేశారు. ప్రతిష్ఠాత్మక మల్లన్న సాగర్ ప్రాజెక్టును పూర్తి చేసి.. ఆ జలాలతో మల్లన్న పాదాలు కడుగుతామని గతంలో కేసీఆర్ ప్రకటించినట్లుగా.. ఆ మాటను ఆయన నిలబెట్టుకున్నారు. ప్రాజెక్టును ప్రారంభించి కోరమీసాల మల్లన్న స్వామికి జలాభిషేకం చేశారు.
గోదావరి జలాలతో మల్లన్నకు అభిషేకం.. మాట నిలబెట్టుకున్న సీఎం - telangana news
CM KCR visited Komuravelli Mallanna temple: కొమురవెల్లి మల్లన్నను సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ వద్ద మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం.. కేసీఆర్ కొమురవెల్లి ఆలయానికి చేరుకున్నారు. గోదావరి జలాలతో మల్లన్నకు అభిషేకం చేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోరమీసాల కొమురవెల్లి మల్లన్నను ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల నడుమ మల్లన్న సాగర్ జలాలను ఆలయానికి తీసుకువచ్చారు. స్వామి వారికి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోదావరి జలాలతో మల్లన్నకు అభిషేకం చేయించారు. దర్శనానంతరం సీఎంకు అర్చకులు ఆశీర్వాచనాలు అందజేశారు. మల్లన్నసాగర్ ఎత్తిపోతలను.. కేసీఆర్ జాతికి అంకితం చేశారు.
ఇదీ చదవండి:చివరి రక్తంబొట్టు ధారపోసైనా దేశాన్ని సరైన మార్గంలో పెడతా: కేసీఆర్