కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్ - కొండ పోచమ్మ జలాశయాన్ని సందర్శించిన కేసీఆర్
16:25 June 12
కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్
సిద్దిపేట జిల్లా మర్కుక్‌లో కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఆకస్మికంగా ఆయన రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం నీటిమట్టం ఎలా ఉంది.. ఎగువన ప్రవాహం ఏమైనా ఉందా అని పరిశీలించారు. వానాకాలంలో సాగునీటి విడుదలకు రూపొందించిన ప్రణాళికలను అధికారులను ఆరా తీశారు.
ఇటీవలే చిన్నజీయర్‌తో కలిసి కేసీఆర్ ఈ రిజర్వాయర్‌ను ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 15 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మ జలాశయాన్ని నిర్మించారు. రిజర్వాయర్ చుట్టూ 15.8 కిలోమీటర్ల మేర కట్ట నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణానికి 1540 కోట్లు వ్యయమైంది. జలాశయం కింద రెండు లక్షల 85 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిస్తారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చెల్ -మల్కాజ్ గిరి జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చనుంది. హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కోసం కేశవాపూర్ వద్ద నిర్మించే జలాశయానికి కొండపోచమ్మసాగర్ నుంచే నీరు వెళ్తుంది.