తెలంగాణ

telangana

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సాగుతుందిలా..

కొండపోచమ్మ సాగర్​ జలాశయాన్ని శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన వివరాలు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న సుదర్శన యాగం, చండీ హోమంలో ముఖ్యమంత్రి దంపతులు, చిన్నజీయర్​ స్వామి పాల్గొననున్నారు. కార్యక్రమం సాదాసీదాగా నిర్వహించనున్నందున ఆహ్వానించిన వీఐపీలు తప్ప ప్రజలెవరూ హాజరు కావద్దని హరీశ్​ రావు విజ్ఞప్తి చేశారు.

By

Published : May 28, 2020, 6:51 PM IST

Published : May 28, 2020, 6:51 PM IST

cm kcr tour schedule in kondapochamma reservior opening
ముఖ్యమంత్రి పర్యటన సాగుతుందిలా...

కొండపోచమ్మ సాగర్​ జలాశయం ప్రారంభానికి హాజరుకానున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ షెడ్యూల్​ వివరాలను మంత్రి హరీశ్​రావు ప్రకటించారు. సిద్దిపేటలో అధికారులతో సమావేశమైన హరీశ్​... ప్రణాళిక ఖరారు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని చివరి లిఫ్టింగ్​ కొండపోచమ్మ రిజర్వాయర్​తో... ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతోందని మంత్రి అన్నారు. 618 మీటర్ల ఎత్తున్న ప్రాజెక్టు ప్రారంభం... చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. కరోనా వల్ల ముఖ్యమైన వారినే ఆహ్వానించి కార్యక్రమం సాదాసీదాగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలెవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.

సీఎం పర్యటన షెడ్యూల్‌..

  • తెల్లవారుజామున 4 గంటలకు కొండపోచమ్మ ఆలయంలో చండీహోమం
  • మర్కూక్‌ పంప్‌హౌస్‌ వద్ద సుదర్శన యాగం నిర్వహణ
  • ఉదయం 7 గంటలకు కొండపోచమ్మ ఆలయం వద్ద చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం కేసీఆర్‌ దంపతులు
  • ఉదయం 9.35 గంటలకు ఎర్రవల్లి రైతు వేదికకు శంకుస్థాపన
  • ఉదయం 9.40 గంటలకు మర్కూక్​ రైతు వేదికకు శంకుస్థాపన
  • ఉదయం 9.50 గంటలకు మర్కూక్‌ పంప్‌హౌస్‌ వద్దకు సీఎం కేసీఆర్‌
  • ఉదయం 10 గంటలకు సుదర్శన యాగంలో పాల్గొననున్న సీఎం దంపతులు, చినజీయర్‌ స్వామి
  • ఉదయం 11.30 గంటలకు మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌, చినజీయర్‌స్వామి
  • ఉదయం 11.35 గంటలకు కొండపోచమ్మ జలాశయం వద్ద గోదావరి జలాలకు హారతి
  • మధ్యాహ్నం 12 గంటలకు మర్కూక్‌ మండలం వరదరాజస్వామి ఆలయంలో సీఎం పూజలు
  • మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం

ABOUT THE AUTHOR

...view details