సిద్దిపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కొండపాక మండలం దుద్దెడలో ఐటీ పార్కుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.45 కోట్ల వ్యయంతో దుద్దెడలో ఐటీ పార్కు నిర్మాణం చేపట్టారు.
అనంతరం పొన్నాలలో తెలంగాణ భవన్‌ను, సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో రైతు వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎన్సాన్‌పల్లిలో ప్రభుత్వ వైద్యకళాశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. 960 పడకల జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం.. కోమటిచెరువు, నెక్లెస్ రహదారిని సందర్శించారు.
సిద్దిపేట నర్సాపూర్‌లో రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించి.. పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. రూ.163 కోట్లతో 2,460 రెండు పడక గదుల ఇళ్ల సముదాయం నిర్మాణం చేపట్టారు. రెండు పడక గదుల ఇళ్ల సముదాయానికి కేసీఆర్ నగర్‌గా నామకరణం చేశారు. రెండు పడక గదుల ఇళ్ల సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొన్నారు.
చింతల్‌చెరువు వద్ద తొలివిడత భూగర్భ మురుగుపారుదల వ్యవస్థ ప్రారంభం కానుంది. చింతల్‌చెరువు వద్ద మురుగుశుద్ధి ప్లాంటును సీఎం ప్రారంభించనున్నారు. రంగనాయకసాగర్ అతిథిగృహాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్... మధ్యాహ్నం 3 గంటలకు సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు.
సిద్దిపేటలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన