ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో పర్యటనలో పలు అభివృద్ధిపనులకు శ్రీకారం చుట్టారు. నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్‌ను, ములుగులో కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఆ ప్రాంగణంలోనే బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
పలకరింపులు, ప్రారంభోత్సవాలతో సాగిన సీఎం కేసీఆర్ పర్యటన - పలకరింపులు, ప్రారంభోత్సవాలతో సాగిన సీఎం కేసీఆర్ పర్యటన
సిద్దిపేట జిల్లాలోని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో పర్యటిస్తున్నారు. కీలక ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. సమీకృత మార్కెట్, కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ములుగులో అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని ఆవిష్కరించారు.
![పలకరింపులు, ప్రారంభోత్సవాలతో సాగిన సీఎం కేసీఆర్ పర్యటన cm kcr tour in gajwel in siddipet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5339127-870-5339127-1576058166417.jpg)
పలకరింపులు, ప్రారంభోత్సవాలతో సాగిన సీఎం కేసీఆర్ పర్యటన
ములుగులో అటవీ కళాశాల, పరిశోధన కేంద్రం వద్ద పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం అనంతరం భవనాన్ని ప్రారంభించారు. పరిశోధన కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం అధికారులు, విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
పలకరింపులు, ప్రారంభోత్సవాలతో సాగిన సీఎం కేసీఆర్ పర్యటన
ఇవీచూడండి: ఇవాళ గజ్వేల్‌లో పర్యటించనున్న ముఖ్యమంత్రి
TAGGED:
cm kcr gajwel tour