ప్రజలందరి మత విశ్వాసాల్ని, మనోభావాల్ని గౌరవిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్కు గుర్తింపు ఉంది. ఉత్సాహభరితంగా ప్రసంగిస్తూ.. ప్రజలను ఊర్రూతలూగించడంలో ఆయన దిట్ట. ఎంత ఉద్వేగభరితమైన ప్రసంగం చేస్తున్నా... మసీదు నుంచి అజాన్ వినిపిస్తే మాత్రం ఆయన ప్రసంగాన్ని వెంటనే ఆపేస్తారు. గురువారం సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తుండగా అజాన్ వచ్చింది. వెంటనే ప్రసంగాన్ని ఆపేసిన కేసీఆర్.. ప్రార్థన ముగిసేదాకా వేచి చూసి తర్వాత మళ్లీ ప్రసంగాన్ని కొనసాగించారు.
సిద్దిపేట సభలో సీఎం కేసీఆర్ మధ్యలో ప్రసంగం ఆపేశారు.. ఎందుకంటే! - సీఎం కేసీఆర్ లేటెస్ట్ అప్డేట్స్
మైకు పట్టుకున్నారంటే పిల్లల నుంచి పెద్దలదాకా సీఎం కేసీఆర్ మాటలని ఆసక్తిగా వింటారు. ఎంతో ఉత్సాహభరితంగా... చాకచక్యంతో మాట్లాడే ఆయన... అజాన్ విషయంలో మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు.
అజాన్ విషయంలో గొప్పతనాన్ని చాటుకున్న సీఎం కేసీఆర్!
ఎన్నికల ప్రచారం సందర్భంగా రోజుకు ఐదారు ప్రదేశాల్లో, సభల్లో పాల్గొనే బీజీ షెడ్యూలో ఉన్నా.. నమాజ్ వినిపిస్తే ప్రసంగాన్ని ఆపేసేవారు. అజాన్ పూర్తైన తర్వాత తిరిగి కొనసాగించేవారు. ఇలా అజాన్ సమయంలో స్వల్ప విరామం ఇచ్చి... విశ్వాసాలను గౌరవిస్తూ సీఎం కేసీఆర్ మరోసారి ఆయన గొప్పతనాన్ని చాటుకున్నారు.
ఇదీ చదవండి:'సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు'
Last Updated : Dec 11, 2020, 8:20 AM IST