తెలంగాణ

telangana

ETV Bharat / state

Cm Kcr Fun: సీఎం కేసీఆర్​నే మాస్క్ తీయమన్నాడంటా! - CM KCR shared his experience

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ (Cm Kcr )నే ఏకంగా ఓ వ్యక్తి మాస్క్ తీయమన్నాడంటా. ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆరే వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్​ ప్రారంభోత్సవం అనంతరం సుధీర్ఘంగా ప్రసంగించిన సీఎం కేసీఆర్ (Cm Kcr) తనకు జరిగిన అనుభవాన్ని పంచుకుని నవ్వులు పూయించారు.

CM KCR
సీఎం కేసీఆర్

By

Published : Jun 20, 2021, 5:37 PM IST

Cm Kcr Fun: సీఎం కేసీఆర్​నే మాస్క్ తీయమన్నాడంటా!

ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr ) ప్రసంగించారంటే మధ్యమధ్యలో ఛలోక్తులు విసరడం ఖాయం. సిద్దిపేటలో కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం అనంతరం సుదీర్ఘంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ (Cm Kcr) ఛలోక్తులు విసిరారు. పాలన ప్రగతిని వివరిస్తూనే నవ్వుల పువ్వులు పూయించారు. విపక్షాలపై విమర్శలు ఎక్కుపెడుతూ చమక్కులు విసిరారు.

నేనో పెండ్లికి పోయిన. పెండ్లికి పోతే ఆ పెండ్లి పిల్లగాడు సార్ మాస్క్ తీయ్ అన్నడు. ఎందుకయ్య అంటే సార్ నువ్వు మళ్ల దొరుకతవో లేదో ఓ ఫొటో తీసుకుంటా అన్నడు. నేను నీకు దొరుకతనో లేదో గానీ కరోనాకు దొరకుతా గదరా బై అన్న. ఆఖరికి వాడుగుంజా వీడు గుంజా నాక్కూడా వచ్చింది కరోనా.. అంటూ తనకు జరిగిన అనుభవాన్ని సమావేశంలో పంచుకుని అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు సీఎం కేసీఆర్.

ఇదీ చూడండి: Cm Kcr: నా కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయ్..

ABOUT THE AUTHOR

...view details