తెలంగాణ

telangana

ETV Bharat / state

'సిద్దిపేట ఎంతో క్రియాశీలకం.. భవిష్యత్​లో అంతర్జాతీయ విమానాశ్రయం' - Chief Minister KCR tour Details

సిద్దిపేట జిల్లాకు త్వరలో అంతర్జాతీయస్థాయి విమానాశ్రయం వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కొండపాక మండలం దుద్దెడలో ఐటీ పార్కుకు సీఎం శంకుస్థాపన చేశాహరు. 45 కోట్ల రూపాయల వ్యయంతో దుద్దెడలో ఐటీ పార్కు నిర్మించనున్నారు.

cm kcr
భవిష్యత్‌లో సిద్దిపేట జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం: సీఎం

By

Published : Dec 10, 2020, 12:39 PM IST

సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతుండగా... జిల్లాకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి శుభాభినందనలు తెలిపారు. రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతం సిద్దిపేట అని పేర్కొన్నారు. సిద్దిపేట అత్యంత క్రియాశీలక ప్రాంతమని స్పష్టం చేశారు.

భవిష్యత్‌లో సిద్దిపేట జిల్లా పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుందని తెలిపారు. సిద్దిపేట అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఐటీ రంగంలో పురోగతి సాధిస్తుందని వెల్లడించారు.

భవిష్యత్‌లో సిద్దిపేట జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం: సీఎం

ABOUT THE AUTHOR

...view details