ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణ పరిధిలోని 9వ వార్డులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ యాదవ్, పలువురు తెరాస పార్టీ నాయకులు పాల్గొన్నారు.
'రైతు బాంధవుడు సీఎం కేసీఆర్' - సిద్దిపేట తాజా వార్త
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా లక్షమొక్కలు నాటుతున్నామని రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు.
'రైతు బాంధవుడు సీఎం కేసీఆర్'
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష మొక్కలు నాటుతున్నామని.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి హరిత సిద్దిపేటకై కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అని నిరంతరం రైతుల కోసం కృషి చేస్తున్నాడన్నారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలెన్నో చేపట్టి రైతుల ఆర్థిక ఎదుగుదల కోసం నిరంతరం పాటుపడుతున్నారన్నారు.
ఇదీ చూడండి:కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హరీశ్