మున్సిపల్ కార్మికులకు రూ.24,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రేవంత్‌కుమార్ డిమాండ్ చేశారు.
'మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి' - citu protest at husnabad on sanitation workers
పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి... కనీస వేతనం రూ. 24 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జులై 3 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రేవంత్‌కుమార్ తెలిపారు.
!['మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి' citu protest at husnabad on sanitation workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7844889-1009-7844889-1593595355829.jpg)
'మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి'
పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 3న మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నా, 9న ఎమ్మెల్యేలకు వినతి పత్రం సమర్పించడం, 20న అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు రేవంత్‌కుమార్ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.