తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ నాయకుల ఆందోళన - citu leaders protest infront of siddipeta collectorate

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ సీఐటీయూ కార్యకర్తలు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. కరోనా సమయంలో విధులు నిర్వర్తిస్తున్న వారందరికీ రక్షణ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

Breaking News

By

Published : Jul 22, 2020, 5:23 PM IST

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందంటూ ఆరోపించారు. దాని వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని... కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు అందించాలని కోరారు.

కరోనా సమయంలోనూ పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు అండంగా ఉండాలని సూచించారు. ప్రతి కార్మికుడికి మాస్కులు, పీపీఈ కిట్లు అందించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ ప్రకటించాలని, 24 వేల రూపాయల వేతనం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న వారికి అదనంగా 5 వేలు చెల్లిస్తూ... కార్మికులందరికీ భద్రత రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

gఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details