తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా - siddipet district news

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ ఆర్టీవో కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్​ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్​ చేయాలని డిమాండ్​ చేశారు.

citu protest
citu protest

By

Published : May 19, 2020, 2:29 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని ఆరోపిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ సీఐటీయూ నాయకులు తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరిస్తూ పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తుందని విమర్శించారు. లాక్​డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో కార్మిక వర్గానికి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించడం లేదని విమర్శించారు. కరోనా నేపథ్యంలో రేయింబవళ్ళు కష్టపడి పని చేస్తున్న మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, లేనిపక్షంలో 24 వేల రూపాయల కనీస వేతనాన్ని వారికి ప్రభుత్వం అందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. కార్మికుల సంక్షేమానికి అనుకూలంగా ఉన్న జీవోలను, చట్టాలను రద్దు చేయడం మానుకోవాలని, లేకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి: నియంత్రిత పంటల సాగుపై 21న సీఎం సమావేశం

ABOUT THE AUTHOR

...view details