భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అనుబంధం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు ఎలాంటి ఆర్థిక సహకారం అందించలేదని జిల్లా ఉపాధ్యక్షులు రేవంత్ కుమార్ అన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి: సీఐటీయూ - latest news of siddipeta
సిద్దిపేట జిల్లాలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అనుబంధం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన చేశారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 1500 ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి: సీఐటీయూ
రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ రంగం కార్మికులకు నెలకు రూ.1500 ఆర్థిక సహకారం చేస్తామని హామీ ఇచ్చి వెల్ఫేర్ బోర్డులో ఉన్న వెయ్యి కోట్ల రూపాయలను అక్రమంగా దారి మళ్లించారని విమర్శించారు. కార్మిక శాఖ అధికారులు భవన నిర్మాణ కార్మికుల సమస్యలుపై చర్చించడం లేదని వాపోయారు. రేషన్ కార్డు లేకపోయిన వెల్పేర్ కార్డు ఉన్నా కార్మికులకు ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు