సిద్దిపేట జిల్లాలోని కోమటిచెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు... లక్ష్మణ్(15), గణేష్(10) మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. స్థానికుల దగ్గర నుంచి వివరాలు సేకరించారు. వారిద్దరూ సిద్దిపేట హనుమాన్‌నగర్ కాలనీకి చెందిన అన్నదమ్ములుగా గుర్తించారు. మొదట వారు గల్లంతయ్యారని ఫిర్యాదు రాగా... గజ ఈతగాళ్లను రప్పించి చెరువులో గాలించారు. ఇద్దరి మృతదేహాలు ఒకేచోట దొరకగా... పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి - siddipet
ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా కోమటిచెరువులో జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి