తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2019, 3:23 PM IST

ETV Bharat / state

గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న రఘునందన్​రావు

సీఎం కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్పినా ఆర్టీసీ కార్మికులను ఆదుకోకుంటే ఎలాగని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్నారాయన.

'కోర్టు ఆదేశాలతో రాజీనామా చేసిన ముఖ్యమంత్రులు'

భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు గజ్వేల్ పట్టణంలో గాంధీ సంకల్పయాత్ర చేపట్టారు. ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ పట్టణం మీదుగా తూప్రాన్​కు యాత్ర కొనసాగింది. గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు.

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పట్ల రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ముఖ్యమంత్రికి చెంపపెట్టని రఘునందన్ అన్నారు. కోర్టు ఏం చేస్తుందని కేసీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో కోర్టు మొట్టికాయలు వేస్తే రాజీనామా చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో యాత్రకు హాజరై రఘునందన్ రావు​కు ఘన స్వాగతం పలికారు.

'కోర్టు ఆదేశాలతో రాజీనామా చేసిన ముఖ్యమంత్రులు'

ఇదీ చూడండి : మొక్కలు నాటిన ఎంపీ బండప్రకాశ్​.. మరో నలుగురికి గ్రీన్​ ఛాలెంజ్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details