కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తొగుటలోని తన నివాసంలో నివాళులర్పించిన ముత్యం రెడ్డి... నేటి తరం నాయకులకు జైపాల్‌రెడ్డి ఆదర్శప్రాయుడని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే, నాలుగు పర్యాయాలు ఎంపీగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన గొప్ప వ్యక్తి జైపాల్‌రెడ్డి అని కొనియాడారు. మంచి వ్యక్తిత్వం కలిగిన నేత మృతి చెందడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు.
'నేటితరం నాయకులకు ఆదర్శప్రాయుడు జైపాల్‌రెడ్డి' - CHERUKU MUTYAM REDDY paid tribute to Jaipal Reddy
మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మృతిపట్ల రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జైపాల్‌రెడ్డికి మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి నివాళులర్పించారు.
!['నేటితరం నాయకులకు ఆదర్శప్రాయుడు జైపాల్‌రెడ్డి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3971500-thumbnail-3x2-ppp.jpg)
CHERUKU MUTYAM REDDY paid tribute to Jaipal Reddy