తెలంగాణ

telangana

ETV Bharat / state

మల్లన్న సాగర్ భూనిర్వాసితులకు చెక్కుల పంపిణీ - cheques-distribution for Mallanna sagar project refueges

సీఎం ఆదేశాల మేరకు ఎట్టకేలకు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరోపాధి, పునరావాసంను అధికారులు కల్పించారు. సిద్దిపేట జిల్లా ఆర్టీఓ కార్యాలయ ఆవరణలో నిర్వాసితులకు చెక్కులను పంచిపెట్టారు.

మల్లన్న సాగార్ భూనిర్వాసితులకు చెక్కుల పంపిణీ

By

Published : May 4, 2019, 12:06 AM IST

Updated : May 4, 2019, 6:45 AM IST

సిద్దిపేట జిల్లా ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో శ్రీ కొమురవెళ్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరోపాధి, పునరావాస కల్పన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నిర్వాసితులకు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు క్రిష్ణ భాస్కర్, వెంకట్రామ రెడ్డి, సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, ఆర్డీఓ జయచంద్రా రెడ్డి చేతుల మీదుగా పరిహార చెక్కులను అందజేశారు. ఈ మేరకు ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసితులతో కలెక్టర్లు చర్చించారు. అందరికీ తగు న్యాయం చేస్తామని అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారిక సిబ్బంది, మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులు పాల్గొన్నారు.

మల్లన్న సాగార్ భూనిర్వాసితులకు చెక్కుల పంపిణీ
Last Updated : May 4, 2019, 6:45 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details