తెలంగాణ

telangana

ETV Bharat / state

Chakali Ilamma Birth Anniversary 2021 : 'మహిళా చైతన్యానికి స్ఫూర్తిదాయకం.. చాకలి ఐలమ్మ జీవితం' - తెలంగాణలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు

మహిళా చైతన్యానికి స్ఫూర్తిదాయకమైన చాకలి ఐలమ్మ జయంతి(Chakali Ilamma Birth Anniversary 2021)ని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిలు.. ఐలమ్మ(Chakali Ilamma Birth Anniversary 2021) విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరోవైపు హైదరాబాద్​లో ట్యాంక్​బండ్​పై ఆమె(Chakali Ilamma Birth Anniversary 2021) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రజక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

మహిళా చైతన్యానికి స్ఫూర్తిదాయకం.. చాకలి ఐలమ్మ జీవితం
మహిళా చైతన్యానికి స్ఫూర్తిదాయకం.. చాకలి ఐలమ్మ జీవితం

By

Published : Sep 26, 2021, 3:27 PM IST

రాష్ట్రంలో వివిధ చోట్ల చాకలి ఐలమ్మ జయంతి(Chakali Ilamma Birth Anniversary 2021) ఉత్సవాలు నిర్వహించారు. మహిళా చైతన్యానికి చాకలి ఐలమ్మ(Chakali Ilamma Birth Anniversary 2021) స్ఫూర్తిదాయకమని నేతలు కొనియాడారు. సిద్ధిపేటలోని హౌసింగ్ బోర్డు చౌరస్తాలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు.. ఆమె(Chakali Ilamma Birth Anniversary 2021) విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో తొలిసారి అధికారికంగా ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణమన్నారు.

ఆమె బాటలోనే అందరం..

చాకలి ఐలమ్మ చూపిన బాటలో అందరం నడవాలని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ మలి ఉద్యమం ఐలమ్మ స్పూర్తితోనే జరిగిందని స్పీకర్ పేర్కొన్నారు. కేసీఆర్, ఐలమ్మ ఆదర్శాలను పరిగణనలోకి తీసుకుని సమాజంలోని అన్ని వర్గాలను గౌరవిస్తూ ముందుకు సాగాలన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఐలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

వీరనారి ఐలమ్మ..

రజాకార్లకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారిగా చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చాకలి ఐలమ్మ 126వ జయంతి పురస్కరించుకుని సికింద్రాబాద్ ధోబీఘాట్​లో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

భావి తరాలు గుర్తించుకునేలా..

తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు హనుమకొండలో ఘనంగా జరిగాయి. హంటర్‌ రోడ్డులోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, జిల్లా కలెక్టర్ హాజరై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను తరతరాలు గుర్తుంచుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రణాళికను రూపొందిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి ఐలమ్మ ప్రతీక అని అన్నారు. అనంతరం పక్కన ఉన్న రజకుల ఆరాధ్యుడు మడెలయ్య విగ్రహానికి పూలమాలలు వేస్తుండగా అక్కడకు వచ్చిన ఓ వృద్ధురాలిని ఎత్తుకుని ఆమె చేత పూలమాల వేయించారు.

హక్కులకై పోరాడుదాం..

నిర్మల్ జిల్లా కేంద్రంలో పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్మల్ కలెక్టరేట్ సమీపంలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని తమ హక్కులు సాధించుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి ఇంద్రకరణ్ సూచించారు. ఐలమ్మ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. రాబోయే రోజుల్లో రజకుల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అణచివేత నుంచే ఆరంభం..

అణచివేత నుంచే చాకలి ఐలమ్మ తిరుగుబాటు ప్రారంభమైందని రాష్ట్ర మంత్రి అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం ధర్నాచౌక్​లో చాకలి ఐలమ్మ 126 జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఐలమ్మకు నివాళి..

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోనూ వేడుకలు నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై ఉన్న చాకలి ఐలమ్మ(Chakali Ilamma Birth Anniversary 2021) విగ్రహానికి పురపాలిక ఛైర్‌పర్సన్‌ సుజాత... పాలకవర్గ సభ్యులు పూలమాలలు వేశారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఆమె విగ్రహం ఏర్పాటు చేయాలని రజక సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details