తెలంగాణ

telangana

By

Published : Nov 14, 2019, 3:16 PM IST

Updated : Nov 14, 2019, 11:34 PM IST

ETV Bharat / state

'కాకితో కబురు పంపినా... చర్చలకు సిద్ధం...'

ఆర్టీసీ కార్మికుల సమ్మె 41 వ రోజు కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లా... హుస్నాబాద్​లో నిర్వహించిన ర్యాలీలో చాడ వెంకట్​రెడ్డి పాల్గొన్నారు. కార్మికులకు రెండు నెలలుగా జీతాలులేక బాధపడుతున్నారని... పలు దుకాణాల్లో చాడా బిక్షాటన చేశారు.

CHADA VENKATREDDY BEGGING FOR TSRTC EMPLOYEES IN HUSNABAD

కాకితో కబురు పంపినా ఆర్టీసీ కార్మికులు చర్చలకు సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు డిపో నుంచి అంబేడ్కర్​ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో చాడ పాల్గొన్నారు. చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారంటూ... చౌరస్తాలోని పలు దుకాణాలలో భిక్షాటన చేశారు. వచ్చిన డబ్బులను కార్మికులకు అందించారు. ఈరోజు చనిపోయిన కార్మికుడికి నివాళులర్పించారు. 28 మంది కార్మికులు చనిపోయినా... సీఎం కేసీఆర్​కు కనికరం లేదని చాడ మండిపడ్డారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో 48 వేల కుటుంబాలు బజారున పడ్డాయన్నారు. కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నా... పట్టించుకోని సీఎం దేశంలో ఎవరూ లేరన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు సమ్మెలో ఉద్ధృతంగా పాల్గొంటామని చాడ వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు.

'కాకితో కబురు పంపినా... చర్చలకు సిద్ధం...'
Last Updated : Nov 14, 2019, 11:34 PM IST

ABOUT THE AUTHOR

...view details