నవంబర్ 3న నిశబ్ద విప్లవం జరగనుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లో ఆయన పర్యటించారు. సిద్దిపేటలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
దుబ్బాకలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది: కిషన్‌రెడ్డి
దుబ్బాకలో తమకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని.. దీన్ని జీర్ణించుకోలేక తెరాస తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లో ఆయన పర్యటించారు.
దుబ్బాకలో తమకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని.. దీన్ని జీర్ణించుకోలేక తెరాస తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇళ్లు కట్టించినా.. వాటికి కేంద్రం వాటా ఇవ్వడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా.. డబ్బులు పంపిణీ జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:గుత్తేదారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవు: ప్రశాంత్‌రెడ్డి