తెలంగాణ

telangana

సిద్దిపేట ఉద్రిక్తతల నేపథ్యంలో బండి సంజయ్​ దీక్ష

By

Published : Oct 26, 2020, 7:27 PM IST

Updated : Oct 26, 2020, 10:18 PM IST

హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు బయలుదేరిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు బయలుదేరిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

22:10 October 26

బండి సంజయ్​కు అమిత్​ షా ఫోన్​..

  • బండి సంజయ్‌కు ఫోన్‌ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 
  • సిద్దిపేట ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న అమిత్‌షా 

22:09 October 26

దీక్షకు దిగిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
  • కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో దీక్షకు దిగిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
  • సీపీని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్‌

19:25 October 26

సిద్దిపేట ఉద్రిక్తతల నేపథ్యంలో బండి సంజయ్​ దీక్ష

హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు బయలుదేరిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

సిద్దిపేటలో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్​ నుంచి సిద్దిపేటకు వెళ్లారు. సిద్దిపేటలోని పలువురి ఇళ్లలో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోదాలు చేశారు. అంజన్​ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చిన భాజపా శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సొమ్మును తీసుకెళ్లేందుకు భాజపా శ్రేణులు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగింది.  

ఇదీ చదవండి:దుబ్బాక భాజపా అభ్యర్థి బంధువు ఇంట్లో రూ.18.67 లక్షలు స్వాధీనం

Last Updated : Oct 26, 2020, 10:18 PM IST

ABOUT THE AUTHOR

...view details