తెలంగాణ

telangana

ETV Bharat / state

కనుల పండుగగా పంబారట్టు ఉత్సవం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో.. అయ్యప్ప మాలధారులు పంబారట్టు ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో స్వామివారి పల్లకిలో ఊరేగింపు చేస్తూ కీర్తనలు పాడారు.

celebrating pambarattu festival in husnabad temple
కనుల పండగగా పంబారట్టు ఉత్సవం

By

Published : Dec 19, 2020, 8:32 PM IST

శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పంబారట్టుఉత్సవాన్ని అయ్యప్ప స్వాములు .. సిద్దిపేట జిల్లాలో ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి స్థానిక ఎల్లమ్మ చెరువుకు పల్లకిలో దేవతామూర్తులను తీసుకెళ్లారు. స్వామి వారికి పంచామృత అభిషేకం చేసి పంబారట్టు కార్యక్రమం నిర్వహించారు.

పట్టణంలోని ప్రధాన వీధుల్లో స్వామివారి పల్లకిలో ఊరేగిస్తూ.. భజనలు చేశారు. అయ్యప్ప స్వామిని పట్టణ ప్రజలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆకుల రజిత, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అయ్యప్ప స్వాములు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:హింసాత్మక చర్యలకు పాల్పడితే సహించేది లేదు: జోగు రామన్న

ABOUT THE AUTHOR

...view details