సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని స్థానిక టేకుల అడవి ప్రాంతంలో ఉసిరి, సీతాఫలాలు, నేరేడు పండ్ల చెట్ల పెంపకాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శర్వానంద్ పరిశీలించారు. దుబ్బాక రేంజ్‌లోని కాసులబాద్, మిరుదొడ్డి రిజర్వ్ ఫారెస్ట్‌లో నానా జాతి మొక్కల పెంపకాన్ని తనిఖీ చేశారు. 160 హెక్టార్లలో విస్తరించి ఉన్న అడవి దట్టంగా పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. నానా జాతి మొక్కల పెంపకం వల్ల పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి కలుగుతుందని వివరించారు. సిద్దిపేట జిల్లాలో ఇంత మంచి రిజర్వ్ ఫారెస్ట్ ఉండటం చాలా బాగుందన్నారు. తనిఖీల్లో సిద్దిపేట జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీధర్ రావు, దుబ్బాక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి, ఫ్లయింగ్ స్క్వాడ్ బాచిరెడ్డి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
మిరుదొడ్డి రిజర్వ్ ఫారెస్టును పరిశీలించిన సీసీఎఫ్ - CCF inspection Mirudhoddi Forest plantation
సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి అటవీ ప్రాంతాన్ని మొదక్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శర్వానంద్ పరిశీలించారు. అటవీ ప్రాంతంలో నాటిన పలు పండ్ల జాతుల మొక్కలను పరిశీలించారు.
CCF inspection Mirudhoddi Forest plantation