Car Accident at Chinna koduru in Siddipet: విద్యార్థులకి ఎన్నో ఆశయాలు ఉంటాయి. బాగా చదువుకొని.. ఉద్యోగం సంపాదించాలని.. తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని ఇలా చాలా ఆశలతో చదవు ప్రయాణాన్ని సాగిస్తారు. ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకి మరింతగా ఎక్కువగా ఉంటాయి. అలాంటి లక్ష్యాలను సాధించాలని ఓ కాలేజ్‌లో చదువుతూ.. పరీక్షలు రాసేందుకు వేరే కాలేజ్‌కి ఉత్సహంగా వెళ్లారు. అనుకున్న విధంగా ఎగ్జామ్ రాసేశారు. తిరిగి వారి ఇంటికి చేరేందుకు కారు ఎక్కారు. విధి వారి జీవిత ప్రయాణాన్ని ఆపివేయాలని అనుకుందో ఏమో.. వారు ఎక్కిన కారు ప్రయాణమే ఓ ముగ్గురు విద్యార్థులకి చివరిది అయింది. మరికొంత మందికి బాధను మిగిల్చింది. వారు ఎక్కిన కారు డ్రైవర్ అతి వేగంగా ప్రయాణించి.. ఆగివున్న లారీని ఢీ( Car and Lorry Accident ) కొట్టాడు. దీంతో ముగ్గురు విద్యార్థుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. మరో ఏడుగురు విద్యార్థులకి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో జరిగింది.
ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేట జిల్లాలోని ఇందూరు ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇంజినీరింగ్ విద్యార్థులు, కరీంనగర్ పట్టణంలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కాలేజీల్లో సెకండ్ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వెళ్లారు. ఎగ్జామ్ రాసి తిరిగి వస్తున్న క్రమంలో చిన్నకోడూరు మండలం అనంత సాగర్ గ్రామ శివారులో ఆగి ఉన్న లారీని వారు ప్రయాణిస్తున్న వాహనం వేగంగా వచ్చిఢీకొట్టింది.
Warangal Road Accident News : వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి గాయలు