సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ ముగింపు కార్యక్రమంలో కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులర్పించారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గతంలో మావోలకు అడ్డాగా ఉండే హుస్నాబాద్‌లో ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని ఏసీపీ మహేందర్ తెలిపారు.
హూస్నాబాద్‌లో పోలీసు అమరవీరులకు కొవ్వొత్తుల ర్యాలీ - సిద్దిపేట జిల్లా తాజా సమాచారం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పోలీసు అమరవీరులకు కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులు అర్పించారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా ప్రజాప్రతినిధులతో కలిసి ఏసీపీ మహేందర్ నివాళులర్పించారు.
హూస్నాబాద్‌లో పోలీసు అమరవీరులకు కొవ్వొత్తుల ర్యాలీ
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు, పోలీసు అమరవీరుల కుటుంబాలను పరామర్శించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించామని ఏసీపీ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం అనేక మంది పోలీసులు అమరులయ్యారని వారి సేవలను ప్రతి ఒక్కరు గుర్తించి గౌరవించాలన్నారు. నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.