సిద్దిపేట జిల్లా తొగుట మండలం కేంద్రంలో దివంగత నేత దుబ్బాక ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అకాల మృతి పట్ల తెరాస ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోనిన ప్రధాన వీధుల గుండా తిరుగుతూ... ‘లింగన్న అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ - ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి తెరాస నేతల నివాళి
దివంగత నేత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి నివాళిగా సిద్దిపేట జిల్లా తొగుటలో తెరాస పార్టీ కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ‘లింగన్న అమర్ రహే’ అంటూ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా తిరిగారు.
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనిత, పీఏసీఎస్ ఛైర్మన్ హరికిషన్ రెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డిగారి శ్రీకాంత్, శ్రీకాంత్ రెడ్డి , తెరాస మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, మండల రైతుబందు కన్వీనర్ కనకయ్య, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ దేవునూరి పోచయ్య తదితరులు హాజరయ్యారు.
TAGGED:
candle rarlly in thoguta