సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో సహకార సంఘ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సంబురాలు చేసుకున్నారు. మెుత్తం 13 స్థానాలకు గానూ 6ఏకగ్రీవంగా కాగా... 7 స్థానాలలో ఎన్నికలు జరిగాయి. గెలిచిన అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం వద్ద రంగులు చల్లుకుంటూ, మిఠాయిలు తినిపించుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. మద్దతుదారులు తమ నాయకుడిని భుజానికెత్తుకొని హర్షం వ్యక్తం చేశారు.
సహకార ఎన్నికల్లో గెలుపు... అభ్యర్థుల ముఖాల్లో మెరుపు - సహకార ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థల సంబురాలు
సహకార ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సంబురాలు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో సహకార ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.
సహకార ఎన్నికల్లో గెలుపు... అభ్యర్థుల ముఖాల్లో మెరుపు
Last Updated : Feb 15, 2020, 5:02 PM IST